- అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు : ఖమ్మం జిల్లాకు చెందిన యువత పర్వతారోహకుడు మోతికుమార్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై ‘సింగరేణి’ జెండాను ఎగురవేశారు. సోమవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఎవరెస్ట్‌పై జెండా ఎగురవేసిన ఫొటోలను బహూకరించారు.
ఈ సందర్భంగా సముద్రమట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండాను ప్రదర్శించడం రాష్ట్రానికి గర్వకారమణమని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. అనంతరం మోతికుమార్... ఇప్పటికే తాను అధిరోహించిన కిలిమంజారో, ఎల్‌బ్రస్ వంటి పర్వతాల గురించిన వివరాలను డిప్యూటీ సీఎంకు వివరించారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా సాధన చేస్తున్నట్లు మోతికుమార్ తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్, డెరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు, జీఎం టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
