ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని కమాన్ బజార్ లో ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. మంగళవారం సాయంత్రం స్కూల్ వదలగానే వారు బయటకు వచ్చారు. కానీ ఇంటికి వెళ్లలేదు. తల్లిదండ్రులు ఖమ్మం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్కూల్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ కొద్ది దూరం నడిచి, తర్వాత పరుగెత్తి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది.
