నవంబర్ నెలాఖరు లోపు చేప పిల్లల విడుదల చేయాలి : కలెక్టర్ శ్రీజ

నవంబర్ నెలాఖరు లోపు చేప పిల్లల విడుదల చేయాలి : కలెక్టర్ శ్రీజ
  • ఖమ్మం ఇన్​చార్జ్​ కలెక్టర్​ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు  : ఈనెలాఖరు లోపు లక్ష్యం మేరకు చేప పిల్లలను విడుదల పూర్తి చేయాలని ఖమ్మం ఇన్​చార్జ్​కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ  అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో చేప పిల్లల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ను ఆమె పరిశీలించారు. అనంతరం ఆరెంపుల బారుగూడెం నల్ల చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల సజావుగా జరగాలన్నారు. 

ఆరెంపుల బారుగూడెం నల్ల చెరువులో 28,800 చేప పిల్లలు విడుదల చేయాల్సి ఉన్నదని, రవ్వ, బొచ్చ, బంగారు తీగ రకాల చేప పిల్లలను శుక్రవారం నల్ల చెరువులో విడుదల చేసినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని 38 చెరువుల్లో 9.5 లక్షల చేప పిల్లలను ఇన్​టైంలో విడుదల చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కె. రవికుమార్, ఎంపీవో శ్రీదేవి, ఫిషరీస్ మండల ఇపఖచార్జ్ లు నవీన్, లక్ష్మణ్, సరిత, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, అధికారులు,   తదితరులు పాల్గొన్నారు