డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్ మార్చాలె

డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్  మార్చాలె

ఖమ్మం:  కొత్తగా మంజూరైన డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్ మార్పు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అన్నారు.  రైల్వే లైన్​ అలైన్​మెంట్​ను మార్చాలని కోరుతూ ఎంపీని ఆయా మండలాల చెందిన ప్రతినిధులు కలిశారు.  ప్రసుత్త అలైన్​మెంట్​తో ఖమ్మం రూరల్​ మండల్లాలో లైన్​ రానుందని ఎంపీకి వివరించారు. 

దీంతో విలువైన వ్యవసాయ భూములకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. రైతులకు మేలు జరిగేలా అలైన్​మెంట్​ మార్చాలని వారు కోరారు.  ఈ సమస్యను త్వరలోనే రైల్వే జీఎం, కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీ వారికి హామీ ఇచ్చారు.  అనంతరం ఎంపీకి వినతి పత్రాన్ని అందజేశారు