- ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి
కూసుమంచి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సూచించారు. సోమవారం మండలకేంస్రంలో ఓ పంక్షన్ హాల్ లో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షణికావేశంతో గొడవలకు పోయి కేసుల పాలు కావద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తు బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సంజీవ్, ఎంపీడీఓ జశ్వంత్ కుమార్, ఎస్సై నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

