సమస్యలు పరిష్కారం కావడం లేదని సర్పంచ్ రాజీనామా

V6 Velugu Posted on Oct 20, 2021

గ్రామంలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ తన పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ మద్దతుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రుక్మిణమ్మ భర్త డీసీసీబీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో తనను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారని ఆమె చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయలేక పోతున్నందుకే  సర్పంచి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం 

ప్రియాంకను అడ్డుకున్నపోలీసులు..ఆమెతో సెల్ఫీలు

కార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ

Tagged problems, Khammam, Khammampadu sarpanch resign

Latest Videos

Subscribe Now

More News