ప్రియాంకను అడ్డుకున్నపోలీసులు..ఆమెతో సెల్ఫీలు

ప్రియాంకను అడ్డుకున్నపోలీసులు..ఆమెతో సెల్ఫీలు

ఆగ్రాలో పోలీస్ కస్టడీలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకగాంధీని అడ్డుకున్నారు పోలీసులు. ఆగ్రా హైవేపై వెళ్తున్న ఆమె కాన్వాయ్ ని పోలీసులు చుట్టుముట్టారు. వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తాను ఎక్కడికెళ్లాలన్న పోలీసుల పర్మీషన్ తీసుకోవాలా.. అని ప్రశ్నించారు ప్రియాకంగాంధీ. అయితే లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని.. వెనక్కి వెళ్లిపోవాలని కోరారు పోలీసులు. 

ప్రియాంక గాంధీని ఆగ్రా హైవేపై అడ్డుకున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రియాంకను పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే.. ఇదే సమయంలో కొందరు మహిళా పోలీసులు ప్రియాంకగాంధీ దగ్గరకు వచ్చి సెల్పీలు తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్స్, ఎస్సైలు, ఓ సీఐ.. ప్రియాంకగాంధీ కారు దగ్గరకు వచ్చి ఆమెతో సెల్ఫీలు దిగారు. కాసేపు పోలీసులతో ముచ్చటించారు ప్రియాంకగాంధీ.