ఖానాపూర్ బంద్.. జేఏసీ నేతల అరెస్ట్

ఖానాపూర్ బంద్.. జేఏసీ నేతల అరెస్ట్

ఖానాపూర్, వెలుగు: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్​ను ఖానాపూర్ నుంచి తరలించడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన పట్టణం బంద్ శనివారం స్వల్ప ఉద్రిక్తతల మధ్య సాగింది. జడ్పీ బాలికల హైస్కూల్​తో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీని జేఏసీ నాయకులు బంద్ చేయించడానికి వెళ్లగా పోలీసులు, ఎంఈవో అడ్డుకున్నారు. 

పిల్లల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని తాము ఈ బంద్​కు పిలుపునిచ్చామని, స్టూడెంట్లకు బయటకు పంపాలని జేఏసీ నాయకులు కోరగా.. ఎంఈఓ సంధ్యారాణి, ఎస్సై రాహుల్ గైక్వాడ్ కుదరదని చెప్పడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తక నెలకొంది. సీఐ అజయ్ కుమార్ అక్కడకు చేరుకొని జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

 ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఖానాపూర్​లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయకుండా ఉట్నూర్​కు తరలించడం సబబుకాదన్నారు. ఇక్కడే స్కూల్​ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్​ చేశారు. జేఏసీ నాయకులు ఆకుల శ్రీనివాస్, లక్ష్మణ్ రావు, గంగారావ్, ప్రణయ్, గజేందర్, శ్రావణ్, ఖలీల్, ఇర్ఫాన్  తదితరులు పాల్గొన్నారు.