చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  •     జనరల్​ బాడీ మీటింగ్​లో ఖానాపూర్​ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు : చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆఫీసర్లను అదేశించారు. మంగళవారం జన్నారం మండల పరిషత్ ఆఫీస్ లో ఎంపీపీ మాదాడి సరోజన అధ్యక్షతన నిర్వహించిన చివరి జనరల్ బాడీ మీటింగ్ కు హాజరయ్యారు. మండలంలోని కొన్ని చెరువులు కబ్జాకు గురవుతున్నాయని తన దృష్టికి వచ్చిందని.. వెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి

ఇరిగేషన్ డీఈ వెంకటేశ్ ను అదేశించారు. రాత్రీపగలు తేడా లేకుండా విద్యుత్ కోతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్థానికంగా ఉండటం లేదని వైస్ ఎంపీపీ సుతారి వినయ్, రేండ్లగూడ ఎంపీటీసీ దాముక మమత ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన బొజ్జు పటేల్​కరెంట్​కోతలపై ప్రజలు తనకు ఫోన్​చేసి చెప్తున్నారని, అనవసరంగా విద్యుత్ కట్ చేయకుండా స్థానికంగా ఉంటూ ప్రజలకు సహకరించాలని విద్యుత్ ట్రాన్స్ కో ఏఈ  లచ్చన్నను అదేశించారు. డాక్టర్లు సైతం నిత్యం అందుబాటులో ఉండి దవాఖానాకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని డాక్టర్ ఉమాశ్రీకి సూచించారు.

ఖరీఫ్ సీజన్​ను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఇబ్బందులు లేకుండా విత్తనాలను అందించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లును ఆదేశించారు.  సమావేశంలో జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపీడీవో శశికళ, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, ఎంపీటీసీలు, అన్ని శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.