ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్​గా రాజురా సత్యం

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్​గా రాజురా సత్యం
  •     వైస్ చైర్మన్​గా కావలి సంతోష్ 

ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్​గా నిర్మల్ జడ్పీ సీఈఓ గోవింద్ వ్యవహరించారు. సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లు మొత్తం 9 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓటు కలిగి ఉన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సైతం హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్​కు చెందిన రాజురా సత్యం

వైస్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్​కు చెందిన కావలి సంతోష్ నామినేషన్లు దాఖలు చేశారు. రెండు పదవుల కోసం వీరిద్దరే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కొత్త చైర్మన్, వైస్ చైర్మన్​తో పాటు ఎమ్మెల్యేను కార్యాలయ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఖానాపూర్ సీఐ, ఎస్ ఐ మోహన్, లింబాద్రి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.