అమిత్ షాకు లేఖ రాసిన ఖర్గే.. ఏమన్నారంటే..!

అమిత్ షాకు లేఖ రాసిన ఖర్గే.. ఏమన్నారంటే..!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, బీజేపీ నేత హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భారత్ న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీకి భద్రత కల్పించాలని ఖర్గే లేఖలో తెలిపారు.  జనవరి 18న యాత్ర అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుండి అస్సాం పోలీసులు రాహుల్ గాంధీకి సరైన భద్రత ఏర్పాటు చేయడంలేదని అన్నారు. 

రాష్ట్రంలో యాత్ర ప్రారంభమైన మొదటి రోజున, అస్సాం పోలీసులు యాత్రకు సురక్షితమైన మార్గాన్ని నిర్ధారించడానికి బదులుగా వేరే మార్గాన్ని చూపించారని చెప్పారు. మరుసటి రోజు, లఖింపూర్ జిల్లాలో యాత్రకు సంబంధించిన పోస్టర్లు మరియు హోర్డింగ్‌లను ధ్వంసం చేస్తూ కొందరు దుర్మార్గులు పట్టుబడ్డారని ఆయన చెప్పారు. 

జనరల్ సెక్రటరీ శ్రీ. జైరాం రమేష్‌తో పాటు భారత జాతీయ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. వాహనాల పై దాడి చేసి లోపల ఉన్నవారిపై నీళ్లు పోయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అన్ని సంఘటనలకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, దుర్మార్గులను ఎవరూ అరెస్టు చేయలేదని ఖర్గే లేఖలో చెప్పారు.  ఇక నుంచి అయినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖర్గే అమిత్ షాను కోరారు.