దిగుమతులు ఆపినా..చైనాపై స్పందించరా?

దిగుమతులు ఆపినా..చైనాపై స్పందించరా?
  • కేంద్రంపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఖర్గే ఫైర్ 

న్యూఢిల్లీ: చైనా తమ ఇంజనీర్లను భారతదేశ తయారీ రంగం నుంచి ఉపసంహరించుకోవడం, అరుదైన ఖనిజాల ఎగుమతులను ఆపేసినా కేంద్రం స్పందించట్లేదని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. 

‘‘ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ రంగం నుంచి చైనా తన అధికారులను ఉపసంహరించుకుంది. ఆ దేశంలో దొరికే అరుదైన ఖనిజాలు, ఎరువుల ఎగుమతులకు సంబంధించి ఆంక్షలు విధించింది. 

ఈ ఖనిజాలను ఆటోమెబైల్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌, రక్షణ, హై సెక్యూరిటీ కరెన్సీ ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌లో ఉపయోగిస్తున్నారు. చైనా ఆంక్షల వల్ల ఇండియాలో ఆయా రంగాలు ప్రభావితం కానున్నాయి. రైతులకు ఎరువుల కొరతతో భారీ నష్టం కలగనుంది. మోదీ ‘మేక్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌‌‌‌‌‌‌‌’ విధానాలు విఫలమయ్యాయి” అని గురువారం ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో మండిపడ్డారు.