పార్టీలో నిజాయితీగా పనిచేసినందుకు అణిచివేశారు

పార్టీలో నిజాయితీగా పనిచేసినందుకు అణిచివేశారు

సీనియర్ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేశారు. సోనియా గాంధీకి తన రాజీనామా లెటర్ పంపించారు. తనకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అవకాశమిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. పార్టీలో హైలెవెల్ లో ఉన్న కొందరు వ్యక్తుల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. వారికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదని… ప్రజల గుర్తింపు కూడా లేదన్నారు. అలాంటివారు పార్టీని నియంత్రిస్తుండడం… నిజాయతీగా పనిచేసేందుకు ప్రయత్నించిన తనను తొక్కేశారని ఆరోపించారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఖుష్బూ రాజీనామా కంటే ముందే ఆమెను జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్. ఇవాళో రేపో ఖుష్బూ బీజేపీలో చేరే అవకాశముంది. ఆమె నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఆమె 2014 నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు.

24 గంటల్లో 66,732 కేసులు..816 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1201 కేసులు.. 6 మంది మృతి

అమ్మాయిలకు ఇంటర్ పాస్ ఐతే రూ.25 వేలు.. డిగ్రీ పాస్ ఐతే రూ.50 వేలు