
బాలీవుడ్ నటి ఖుషీకపూర్(Khushi Kapoor) అందాలతో కనువిందు చేస్తోంది. నేటి తరం నటి ఖుషీ కపూర్ ఇదే పంథాను అనుసరిస్తోంది. తన సోదరి జాన్వీ కపూర్(Jhanvi Kapoor) కి సైతం ఖుషీ పోటీ నిచ్చేంతగా ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుకరిస్తోంది. తనదైన గ్రేస్- స్టైల్‌కు మారుపేరుగా ఖుషీ మేకోవర్ ఆసక్తిని కలిగిస్తోంది.
ఇటీవలే అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి పార్టీలో ఖుషీ లుక్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ బ్యూటీ రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టగానే షో స్టాపర్ గా అలంకరించింది. ప్రముఖ ఫ్యాషన్ గురు మనీష్ మల్హోత్రా రూపొందించిన అద్భుతమైన ఐవరీ లెహంగాలో స్పాట్‌లైట్ లో వెలిగిపోయింది. ఎంతో సహజంగా అందాన్ని ప్రదర్శించడమే కాకుండా భారతీయ హస్తకళల గొప్ప సంప్రదాయానికి నివాళిగా కనిపించింది ఈ రూపం.
ముత్యాలు, స్ఫటికాలు, థ్రెడ్‌వర్క్ ఎంబ్రాయిడరీతో భారీగా అలంకరించిన ఐవరీ లెహెంగాను ధరించింది ఖుషీ. బరువైన ఫ్లోర్-లెంగ్త్ లెహెంగా స్కర్ట్ వెడల్పాటి వెండి అంచుని కలిగి ఉంది. దీనికి సరిపోలే ఐవరీ టోనల్ ఎంబ్రాయిడరీ-లాడెన్ బ్లౌజ్‌ను ధరించింది. ఫ్లవర్ థ్రెడ్ వర్క్‌తో కూడిన ఈ ఐవరీ పీస్ విలువ రూ. 4.85 లక్షలు.
ముఖేష్ అంబానీ..భార్య నీతా అంబానీ( Nita Ambani) వినాయక చవితి సందర్బంగా (సెప్టెంబర్ 19న) పలువురు బాలీవుడ్ సెలబ్రేటిస్ ని తమ యాంటిలియా లోని విలాసవంతమైన నివాసంలో ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, రణవీర్ సింగ్, దీపికా పడుకునే, సీనియర్ నటి రేఖ, తదితరులు పాల్గొనడంతో..బిజినెస్ మెన్ ఇంట్లో..బాలీవుడ్ తారల అందం అన్నట్టు కనిపిస్తోంది.