క్లీన్ స్కిన్ కోసం ఒకే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారా..

క్లీన్ స్కిన్ కోసం ఒకే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారా..

ముఖం మీద స్కిన్ శుభ్రంగా, అందంగా ఉండాలంటే టోనర్ వాడటం తప్పనిసరి. టోనర్ వాడటం వల్ల చర్మరంధ్రాల్లో పేరుకున్న మురికిని తీసేయొచ్చు. చర్మం మీది జిడ్డు కూడా వదులుతుంది. అలాగని ఏదంటే అది వాడకుండా ఆల్కహాల్ లేని నేచురల్ టోనర్స్ వాడాలి.

• చాలామంది ఎప్పుడూ ఒకేరకమైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలా కాకుండా ఏజ్ కి తగ్గ బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి.
• సరిపడా నిద్ర పోకపోతే స్ట్రెస్ హార్మోన్లు విడుదలై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. అందుకని స్కిన్ దెబ్బతినకుండా ఉండాలంటే కంటినిండా నిద్రపోవాలి. అంతేకానీ అర్ధరాత్రుళ్ల వరకు మొబైల్ఫోన్ పట్టుకుని కూర్చోవద్దు.
• చర్మం మీద ముడత కనిపిస్తే చాలు వెంటనే యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ వాడతారు చాలామంది. ఇలా అనవసరంగా బ్యూటీ ప్రొడక్ట్స్లను వాడడం వల్ల చర్మానికి మరింత హాని కలుగుతుంది.

ALSO READ : సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్.. వేలంలో లక్ష రూపాయలు

ఇవే కాకుండా, కొందరు ఉన్నట్టుండి డైట్ మారుస్తారు. రాత్రిపూట చర్మానికి క్రీము రాసుకోరు. ముఖం మీద పింపుల్ ఉంటే ఎప్పుడూ దాని మీదే చేయి ఉంటుంది. బ్లాక్ హెడ్స్న గోళ్లతో తీస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల చర్మం మీద ఉండే కణాలు దెబ్బ తింటాయి. అందుకని ఫేషియల్ స్కిన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.