క్యాట్ వాక్ చేసినందుకు 3 ఏళ్ళ నిషేధమా?.. ఇదెక్కడి న్యాయం

క్యాట్ వాక్ చేసినందుకు 3 ఏళ్ళ నిషేధమా?.. ఇదెక్కడి న్యాయం

నార్త్ హీరోయిన్ సోమ లైష్రామ్(Soma Laishram) ను సినిమాల నుండి బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది మణిపూర్ కు చెందిన కంగ్లేపాక్ కంబా లప్ అనే సంస్థ. ఈ సంస్థ విధించిన నిషేధం ప్రకారం హీరోయిన్ సోమ లైష్రామ్ సినిమాల్లో గానీ, సినిమాకు సంబందించిన ఈవెంట్స్ గానీ దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనియ్యాంశం అయింది. 

Also Read : ఆస్ట్రేలియాలో జవాన్ సరికొత్త రికార్డ్.. ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు షారుఖ్

ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  మణిపూర్ కు చెందిన యంగ్ హీరోయిన్ సోమ లైష్రామ్  ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. అంతేకాదు నిర్వాహకుల కోరికమేరకు రాంప్ పై క్యాట్ వాక్ కూడా చేసింది. నిజానికి ఇదే ఆమె చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే.. మణిపూర్ లో ఫ్యాషన్ షోలు నిర్వహించడం, వాటిలో  పాల్గొనడం, క్యాట్ వాక్ చేయడం వంటి వాటిని నేరంగా భావిస్తారు. ఉల్లంగిస్తే పెద్ద  ఎత్తున శిక్షలు కూడా పడుతాయి. అందుకే సోమ లైష్రామ్ పై కంగ్లేపాక్ కంబా లప్ సంస్థ ఆగ్రహిం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మణిపూర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 

అయితే తాను హాజరైన ఈవెంట్ ఫ్యాషన్ షో కాదని, ఓ కల్చరల్ ప్రొగ్రామ్ మాత్రమే అని, మై హోమ్ ఇండియా అనే ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సోమ. అంతేకాదు.. ఈ ఈవెంట్ లో సోమ.. మణిపూర్ లో జరుగుతున్న విధ్వంసాల గురించి, అక్కడ శాంతి చేకూరాలని కూడా కోరుకుంది. మరి హీరోయిన్ సోమ లైష్రామ్ ఇచ్చిన వివరణతో మణిపూర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.