మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి : విజయ్ దేవరకొండ

మా ఇద్దరి ఆలోచనలు  ఒకేలా ఉంటాయి : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా ఇటీవల అభిమానులతో ఇంటరాక్షన్ నిర్వహించాడు విజయ్. సినిమాతో పాటు తన లైఫ్‌‌‌‌, కెరీర్‌‌‌‌‌‌‌‌ గురించి విజయ్ చెప్పిన విశేషాలు...

‘‘ఈ సినిమా ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లవర్ బాయ్‌‌‌‌‌‌‌‌గా, సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లో మ్యారీడ్ బాయ్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తా. ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో సాగే ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. సమంత, శివ నిర్వాణ లాంటి మంచి టీమ్ లభించడంతో  ఈ మూవీ జర్నీని బాగా ఎంజాయ్ చేశా. ఎమోషన్, రొమాన్స్, యాక్షన్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫన్ ఉన్న సినిమా ఇది. ఫస్ట్ హాఫ్‌‌‌‌‌‌‌‌లో వెన్నెల కిషోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లో రాహుల్ రామకృష్ణ నవ్విస్తారు. పాటలు విన్నప్పుడు ఈ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అందుకే మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం. 

తెలివైన అమ్మాయి

సినిమా డిస్కషన్స్‌‌‌‌‌‌‌‌లో సమంత మంచి ఐడియాస్ ఇచ్చేది. ఆమె తెలివైన అమ్మాయి. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కనుక డబ్బు, జీవితం గురించిన మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. మతపరమైన విషయాల్లో ఆమెను డౌట్స్ అడిగేవాడిని. సినిమాకి సంబంధించి మొదట్లో ఏదైనా నచ్చకుంటే శివకు ఓపెన్‌‌‌‌‌‌‌‌గా చెప్పేవాడిని. అలా ఫేస్‌‌‌‌‌‌‌‌ మీదే చెప్పకూడదని సమంత సలహా ఇచ్చింది. శివ, నేను కనెక్ట్ అవడానికి నెలరోజుల టైమ్ పట్టింది. శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఫుల్ క్లారిటీ ఉంటుంది. 

ఇష్టాలెన్నో.. 

డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ నన్నెంతో ఎగ్జైట్ చేస్తుంటుంది. కొన్నేళ్ల తర్వాత యాక్టింగ్‌‌‌‌‌‌‌‌లో బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేస్తా.  అలాగే ఆర్కిటెక్చర్ కూడా ఇష్టం. ఒక ఫామ్ కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకుంటా. ట్రావెలింగ్, స్పోర్ట్స్ ఇష్టం. మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌కు వెళితే అది స్వర్గంలా అనిపించింది. ‘ఖుషి’తో కాశ్మీర్ నా ఫేవరేట్ ప్లేస్ అయింది. హైదరాబాద్ బిర్యానీ, దోశ, బర్గర్, ఛీజ్ కేక్ ఇష్టంగా తింటా. ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి బాస్కెట్ బాల్ ఆడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అలాగే బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి. 

జీవితమంటే.. 

లైఫ్‌‌‌‌‌‌‌‌లో అతి పెద్ద విజయాలు, అపజయాలు చూశాను. ఆ రెండింటినీ ఒకేలా చూడాలి. ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఆ తప్పులు రిపీట్ చేయకూడదు. జీవితం అంటే గెలుపు, ఓటమి కాదు జీవించడం. లైఫ్‌‌‌‌‌‌‌‌లో మనల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నామో ఆ గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ
ముందుకెళ్లాలి. 

పెళ్లి ఎప్పుడంటే..?

పనిలో పడితే బేసిక్ థింగ్స్ కూడా మర్చిపోతా. వర్క్ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గుర్తుచేస్తూ, నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది, లేక వచ్చే ఏడాది అంటూ పెళ్లికేమి డేట్ ఫిక్స్ చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకుంటా. హడావుడి లేకుండా నా పెళ్లి జరగాలి. అలాగని ఎవరికీ తెలియకుండా ఆ విషయాన్ని దాచలేను. 

కొత్త సినిమాల గురించి.. 

డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ లేవు కానీ ‘పోకిరి’ సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఇష్టం. అలాంటి ఇంట్రో నా సినిమాలో ఎప్పుడు కుదురుతుందో. పరశురాం, గౌతం తిన్ననూరి సినిమాలకు అద్భుతమైన స్క్రిప్ట్స్ కుదిరాయి. తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాథేశ్వరన్, అరుణ్ ప్రభులతో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే అవి కూడా ప్రారంభిస్తా. 

డబ్బు, గౌరవం ముఖ్యం

జీవితంలో ఎన్నో సాధించాలనే కోరిక, అందుకు తగ్గ ఇన్‌‌‌‌స్పిరేషన్ నాకుంది. ఇంటి అద్దె మొదలు నెలసరి ఖర్చులకు ఇబ్బందులు పడటం చూశా. వీటన్నింటి నుంచి బయటపడి కంఫర్ట్‌‌‌‌గా ఉండాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలని కోరుకున్నా. అవన్నీ కావాలంటే ధైర్యంగా ప్రయత్నాలు చేయాలి. లైఫ్‌‌‌‌లో డబ్బు, గౌరవం ముఖ్యం. నన్నెవరైనా అగౌరవంగా చూస్తే క్షమించను.