
పాపులర్ మోడల్ కారెన్స్‌లో కొత్త వెర్షన్‌ను కియా గురువారం లాంచ్ చేసింది. కారెన్స్ క్లావిస్ 6 , 7-సీటర్లలో అందుబాటులోకి వచ్చింది. జీ1.5 లీటర్స్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, డీ1.5 డీజిల్ ఇంజిన్‌తో మూడు వేరియంట్లలో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. 18 సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయని కియా ఇండియా పేర్కొంది. రూ.25 వేలు కట్టి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు.
మరోవైపు కారెన్స్ క్లావిస్‌లో తమ మొదటి మాస్-మార్కెట్ (అఫోర్డబుల్ ధరలోని) ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ ఎండీ గ్వాంగ్గు లీ తెలిపారు. ఈవీ6, ఈవీ9 అనే రెండు ప్రీమియం ఈవీలను ఇండియాలో కియా అమ్ముతోంది. వీటి ధరలు వరుసగా రూ.65.97 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ.1.30 కోట్లు (ఎక్స్-షోరూమ్).