
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్.. రెండు చోట్లా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది కియారా అద్వాని. ఫిబ్రవరిలో సిద్దార్థ్ మల్హోత్రాని పెళ్లాడిన ఆమె, రియల్ లైఫ్‌లోనూ ఫుల్ ఖుషీగా ఉంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ విషయంలో ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా చకచకా సినిమాలు చేస్తోంది. కార్తిక్ ఆర్యన్‌కు జంటగా ఆమె నటించిన హిందీ చిత్రం ‘సత్య ప్రేమ్ కి కథ’.. ఈనెల 29న విడుదల కానుంది. మరోవైపు సౌత్‌లో రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘గేమ్ చేంజర్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి కియారా ఎంపికైనట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ‘వార్ 2’ చిత్రం తీయబోతోంది. ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో నటించే ఈ మూవీని ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానిని ఓకే చేసినట్టు తెలుస్తోంది. అయితే హృతిక్‌కి జంటగా నటిస్తుందా, లేక ఎన్టీఆర్‌కి జోడీనా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో ఆమె ఎవరికి జంటగా నటించినా, సినిమా మాత్రం పాన్ ఇండియా రేంజ్ క్రేజీ మల్టీస్టారర్ కావడంతో అనౌన్స్‌మెంట్ కూడా రాకుండానే అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో కియారా కెరీర్‌కు ఈ సినిమా మరింత ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.