Sudeep: ఏ పార్టీలో చేరట్లేదు.. బీజేపీకి ప్రచారం చేస్త: సుదీప్

Sudeep: ఏ పార్టీలో చేరట్లేదు.. బీజేపీకి  ప్రచారం చేస్త: సుదీప్

తాను బీజేపీలో చేరతారంటూ వస్తున్న ప్రచారంపై కన్నడ స్టార్ హీరో  కిచ్చా సుదీప్ క్లారిటీ ఇచ్చారు.  తాను ఏ పార్టీలో జాయిన్ కావడం లేదని.. పోటీ చేయడం లేదని చెప్పారు. సీఎం బసవరాజు బొమ్మైని కలిసిన సుదీప్..  బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని తెలిపారు. సీఎం బసవరాజు బొమ్మైని తాను ప్రేమగా మామా అని పిలుచుకుంటానని.. తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని చెప్పారు. బసవరాజు బొమ్మై తనకు కష్టకాలంలో అండగా నిలిచారని అన్నారు.  బసవరాజు బొమ్మైకి .. తన మద్దతు ప్రకటించడానికే ఇక్కడికి వచ్చానని వెల్లడించారు.

తనకు వచ్చిన బెదిరింపు లేఖపై స్పందించిన సుదీప్ ఆ లేఖ ఎవరు పంపారో తెలుసని... సరైన సమయంలో వారికి సమాధానం  చెబుతానని  హెచ్చరించారు. సుదీప్ ఏ పార్టీకి చెందిన వాడు కాదని.. తనకు, తాను ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వడానికే  కలిశారని సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు.  

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  మే 13న కౌంటింగ్ జరగనుంది.  ఈ క్రమంలో  కర్నాటకలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్  ఉన్న సుదీప్ ను రాజకీయాల్లోకి తీసుకురావడానికి పలు  పార్టీలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి.  వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సుదీప్ ను  రాష్ట్రంలో   ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లోఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది.

కన్నడ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు సుదీప్.  హిందీ, తెలుగ, తమిళ సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో ఈగ, బాహుబలి,సైరా నరసింహారెడ్డితో తెలుగువారికి దగ్గరయ్యారు. 

https://twitter.com/ani_digital/status/1643559459581566976