జీడిమెట్ల: కిడ్నాపైన బాలుడు దొరికిండు...మీడియాలో రావడంతో తీసుకువచ్చి అప్పగించిన వ్యక్తి

జీడిమెట్ల: కిడ్నాపైన బాలుడు దొరికిండు...మీడియాలో రావడంతో తీసుకువచ్చి అప్పగించిన వ్యక్తి
  •     నిందితుడి అరెస్ట్​

జీడిమెట్ల, వెలుగు: సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో కిడ్నాపైన బాలుడు దొరికాడు. వార్త మీడియాలో రావడంతో అతన్ని తీసుకెళ్లిన వ్యక్తే గురువారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్​లో అప్పగించాడని సీఐ మల్లేశ్ తెలిపారు. గత నెల 20న రైల్వేస్టేషన్​నుంచి నిఖిల్(3) కిడ్నాప్​అయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తుండగా.. చింతల్​కు చెందిన షేక్​మహబూబ్ అలీ అనే వ్యక్తి బాబును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు.  అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతనితోపాటు బాలుడిని  రైల్వే పోలీసులకు అప్పగించారు.