మదనపల్లిలో కిడ్నీల దందా..మహిళ మృతితో బయటపడ్డ ముఠా గుట్టు

మదనపల్లిలో కిడ్నీల దందా..మహిళ మృతితో బయటపడ్డ ముఠా గుట్టు

ఏపీలోని మదనపల్లిలో కిడ్నీల దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డబ్బు ఆశ చూపి డోనర్లను, అధిక డబ్బులు వసూలు చేస్తూ పేషెంట్లను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్నారు.గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్నారు. కిడ్నీ ఆపరేషన్​ చేసేందుకు అనుమతి లేకున్నా యథేచ్చగా సర్జరీలు చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కిడ్నీ ఆపరేషన్​ చేస్తుంగా మహిళమృతిచెందడంతో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. 

ఆంధ్ర ప్రదేశ్​ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కిడ్నీ రాకెట్​దందా బట్టబయలయింది. స్థాని ఎస్ బీఐ కాలనీలోఇ గ్లోబల్​ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి జోరుగా సాగుతోంది. డబ్బు ఆశచూపి దాతలనుంచి తక్కువ మొత్తం చెల్లించి.. సంపన్నులకు కిడ్నీ మార్పిడి చేస్తూ కోట్లు గడిస్తున్నారు నిర్వాహకులు. మదనపల్లి ప్రభుత్వాస్పత్రి డయాలిసిస్​ సెంటర్​, పుంగనూరు డయాలసిస్​ సెంటర్ ఇంఛార్జీలతో కలిసి ఈ అక్రమ కిడ్నీ మార్పిడి దందాను నిర్వహిస్తున్నారు. 

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు,పుంగనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్ లు తమ దగ్గరకు డయాలసిస్ చేసుకోవడానికి వచ్చే ధనవంతులైన కిడ్నీ బాధితులను గుర్తించి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కిడ్నీ  ఏర్పాటు చేయిస్తామని బేరాలు కుదుర్చుకున్నారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన కిడ్నీ బ్రోకర్లు పెళ్లి పద్మ,కాకర్ల సత్య,వెంకటేష్ లతో వ్యాపార లావాదేవీలు మాట్లాడుకుని కిడ్నీ దాతలను డబ్బు ఆశ చూపి ఆకర్షిస్తున్నారు. బ్రోకర్ల ద్వారా వారిని వైజాగ్ నుంచి మదనపల్లికి రప్పించే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో మదనాలప్లి గ్లోబల్​ ఆస్పత్రి డాక్టర్​ అవినాష్​, డాక్టర్​ శాశ్వతి, మరో వ్యక్తి నీరజ్​ మధ్యవర్తితోకిడ్నీ రాకెట్​ గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. 

సోమవారం(నవంబర్11) వైజాగ్ మధురవాడకు చెందిన దాత యమున  కిడ్నీ తీసుకునేందుకు గ్లోబల్​ ఆస్పత్రిలో సర్జరీ చేయగా.. ఆపరేషన్​ వికటించి యమున మృతిచెందింది. గుట్టు చప్పుడు కాకుండా యమునా మృతదేహాన్ని విశాఖకు తరలించే యత్నం చేయగా ఆమె భర్త పోలీసులకు ఫక్షన్​ చేయడంతో కిడ్నీ రాకెట్​ ముఠా అక్రమ దందా బయటపడింది. యమునతోపాటు కిడ్నీ ఇచ్చేందుకు వచ్చిన మరో దాత ఆచూకి తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 

కిడ్నీ మార్పిడికి ఎటువంటి అనుమతులు లేని గ్లోబల్​ ఆస్పత్రిలో రహస్యంగా కిడ్నీ ఆపరేషన్లు చేస్తూ  కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.. గత కొంత కాలంగా ఈ ముఠా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.  ఈ కేసులో మదనాపల్లి ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్​ సెంటర్​ ఇంఛార్జ్​ బాలరంగడు, పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ ఇంచార్జి బాలాజీ నాయక్ లు కీలక సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. గ్లోబల ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ అవినాష్,డాక్టర్ శాశ్వతి,నీరజ్ లను సాయంతో  ఈవ్యవహారం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  డాక్టర్ అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు చిత్తూరు డిసిహెచ్ఎస్ కావడం ఈ కిడ్నీరాకెట్​ ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

కిడ్నీ రాకెడ్​ ముఠా సభ్యులు బాలరంగడు, బాలాజీ నాయక్​, డాక్టర్​ అవినాష్​, డాక్టర్​ శాశ్వతి, నీరజ్​ లను మదనాపల్లి డీఎస్పీ ఆఫీస్​ కు తరలించి విచారిస్తున్నారు. ఈ కిడ్నీ రాకెట్​ సంబంధించి మరిన్ని వివరాలు బయటికి పోలీసుల విచారణతో బయటికి వచ్చే అవకాశం ఉంది.