ఐపీఎల్‌‌ నుంచి తప్పుకున్న కీరన్‌‌

ఐపీఎల్‌‌ నుంచి తప్పుకున్న కీరన్‌‌

ముంబై బ్యాటింగ్‌‌ కోచ్‌‌గా ఎంపిక

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌‌ డ్యాషింగ్‌‌ బ్యాటర్‌‌, టీ20 ఫార్మాట్‌‌ లెజెండరీ ప్లేయర్లలో ఒకడైన కీరన్‌‌ పొలార్డ్‌‌ ఐపీఎల్‌‌లో ఆటకు గుడ్‌‌బై చెప్పాడు. 13 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌‌కు ఆడిన పొలార్డ్‌‌ ఐపీఎల్​కు రిటైర్మెంట్​ ప్రకటించారు. ఇంకొన్నేండ్లు ఆడాలని భావించినప్పటికీ ముంబై ఫ్రాంచైజీతో చర్చించిన తర్వాత వీడ్కోలు చెప్పాలని డిసైడయ్యాడు. 35 ఏండ్ల పొలార్డ్‌‌ 2010లో ఐపీఎల్‌‌లో తొలిసారి అడుగు పెట్టాడు. తన కెరీర్‌‌లో 189 మ్యాచ్‌‌లు ఆడి 3142 రన్స్‌‌ చేశాడు.  ముంబై గెలిచిన ఐదు ఐపీఎల్‌‌ టైటిల్స్‌‌తో పాటు 2011, 2013 చాంపియన్స్‌‌ లీగ్‌‌ విజయాల్లోనూ పాలు పంచుకున్నాడు. గత సీజన్‌‌లో మాత్రం 11 గేమ్స్‌‌లో 144 రన్స్‌‌తో నిరాశ పరిచాడు. క్రికెటర్‌‌గా లీగ్‌‌కు దూరం అవుతున్న పొలార్డ్‌‌ను వదులుకునేందుకు ముంబై ఇష్టపడటం లేదు. దాంతో, అతని సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ సీజన్‌‌ నుంచి పొలార్డ్‌‌ బ్యాటింగ్‌‌ కోచ్‌‌గా తమ జట్టుకు పని చేస్తాడని ప్రకటించింది.

10 ఫ్రాంచైజీలు రిలీజ్‌‌ చేసిన ప్లేయర్లు

హైదరాబాద్​ (మిగిలిన డబ్బు: 42.45 కోట్లు): విలియమ్సన్‌‌, పూరన్‌‌, సుచిత్‌‌, గార్గ్‌‌, సమర్థ్‌‌, రొమారియో, సౌరభ్‌‌ దూబే, అబాట్‌‌, శశాంక్‌‌, శ్రేయస్‌‌ గోపాల్‌‌, సుశాంత్‌‌ మిశ్రా, విష్ణు వినోద్‌‌.

ముంబై (మిగిలిన డబ్బు: 20.55 కోట్లు): పొలార్డ్‌‌, అన్మోల్‌‌ప్రీత్‌‌, ఆర్యన్‌‌ జుయల్‌‌, థంపి, సామ్స్‌‌, అలెన్‌‌, ఉనాద్కట్‌‌, మయాంక్‌‌ మార్కండే, మురుగన్‌‌ అశ్విన్‌‌,  రాహుల్‌‌ బుద్ధి, మెరిడిత్‌‌, సంజయ్‌‌ యాదవ్‌‌, తైమల్‌‌ మిల్స్‌‌. ట్రేడింగ్‌‌ ద్వారా బెరెండార్ఫ్‌‌ను తీసుకుంది.

పంజాబ్‌‌ (మిగిలిన డబ్బు: 32.20 కోట్లు): మయాంక్‌‌, ఒడియన్‌‌ స్మిత్‌‌, వైభవ్‌‌ అరోరా, బెన్నీ హోవెల్‌‌, ఇషాన్‌‌ పోరెల్‌‌, అన్ష్‌‌ పటేల్‌‌, ప్రేరక్‌‌ మన్కడ్‌‌, సందీప్‌‌ శర్మ, వ్రితిక్‌‌ చటర్జీ.

చెన్నై (మిగిలిన డబ్బు: 20.45కోట్లు): డ్వేన్‌‌ బ్రావో, ఊతప్ప, మిల్నే, హరి నిశాంత్‌‌, క్రిస్‌‌ జోర్డాన్‌‌, భగత్‌‌ వర్మ, కేఎం ఆసిఫ్‌‌, ఎన్‌‌. జగదీశన్‌‌

గుజరాత్‌‌ (మిగిలిన డబ్బు:  19.25 కోట్లు): రహ్మనుల్లా గుర్బాజ్‌‌, ఫెర్గూసన్‌‌, డోమినిక్‌‌ డ్రెక్స్‌‌, గుర్‌‌కీరత్‌‌, జేసన్‌‌ రాయ్‌‌, వరుణ్‌‌ ఆరోన్‌‌

లక్నో  (మిగిలిన డబ్బు: 23.35 కోట్లు ): ఆండ్రూ టై, అంకిత్‌‌ రాజ్‌‌పూత్‌‌, దుష్మంత చమీర, ఎవిన్‌‌ లూయిస్‌‌, హోల్డర్‌‌, మనీశ్‌‌ పాండే, షాబాజ్‌‌. 

కోల్‌‌కతా (మిగిలిన డబ్బు: 7.05 కోట్లు): కమిన్స్‌‌, బిల్లింగ్స్‌‌, అమన్‌‌ ఖాన్‌‌, శివం మావి, నబీ, చమిక కరుణరత్నె, ఫించ్‌‌, హేల్స్‌‌, అభిజీత్‌‌ తోమర్‌‌, రహానె, అశోక్‌‌ శర్మ, బాబా ఇంద్రజిత్‌‌, ప్రథమ్‌‌ సింగ్‌‌, రమేశ్‌‌ కుమార్‌‌, రసిఖ్‌‌ సాలమ్‌‌, షెల్డన్‌‌ జాక్సన్‌‌. ట్రేడింగ్‌‌ ద్వారా శార్దూల్‌‌ ఠాకూర్‌‌, రహ్మనుల్లా గుర్బాజ్‌‌, లోకీ ఫెర్గూసన్‌‌ను తీసుకుంది.

రాజస్తాన్‌‌ ( మిగిలిన డబ్బు: 13.2 కోట్లు): అనూనయ్‌‌ సింగ్‌‌, కర్బిన్‌‌ బాష్‌‌, డారిల్‌‌ మిచెల్‌‌, జేమ్స్‌‌ నీషమ్‌‌, కరున్‌‌ నాయర్‌‌, కూల్టర్‌‌నైల్‌‌, వాండర్‌‌ డసెన్‌‌, శుభం గర్వాల్‌‌, తేజస్‌‌ బరోకా

బెంగళూరు(మిగిలిన డబ్బు: 8.75 కోట్లు): బెరెండార్ఫ్‌‌, అనీశ్వర్‌‌ గౌతమ్‌‌, సీవీ మిలింద్‌‌, లవ్‌‌నిత్‌‌ సిసోడియా, రూథర్‌‌ఫర్డ్‌‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌‌ (మిగిలిన డబ్బు: 19.45 కోట్లు): శార్దూల్‌‌ ఠాకూర్‌‌, టిమ్‌‌ సిఫర్ట్‌‌, అశ్విన్‌‌ హెబ్బర్‌‌, కేఎస్‌‌ భరత్‌‌, మన్‌‌దీప్‌‌ సింగ్‌‌. ట్రేడింగ్​ ద్వారా అమన్‌‌ ఖాన్‌‌ను తీసుకుంది.

  • 163 పది ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకున్న ప్లేయర్లు
  • 85 రిటెన్షన్‌, ట్రేడింగ్‌ తర్వాత ఫ్రాంచైజీలు రిలీజ్‌ చేసిన ప్లేయర్లు
  • 87 రిటెన్షన్‌, రిలీజ్‌, విత్‌డ్రా తర్వాత వేలంలో అందుబాటులో ఉన్న ఖాళీలు
  • 206 కోట్లు అన్ని ఫ్రాంచైజీలకు కలిపి వేలంలో అందుబాటులో ఉన్న మొత్తం డబ్బు