
హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్లో అంపైర్ నిర్ణయం అసంతృప్తి వ్యక్తం చేసి వ్యంగ్యంగా స్పందించినందుకుగాను ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ జరిమానాకు గురయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిని అతిక్రమంచి లెవల్ 1 నేరానికి పాల్పడి నందుకుగాను అతనిపై 25 శాతం జరిమానా విధించారు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో డ్వేన్ బ్రావో వేసిన చివరి ఓవర్ లో అంపైర్ వైడ్ ఇవ్వనందుకుగాను అసహనంతో పొలార్డ్ దాదాపుగా కుడివైపు ట్రామ్‌లైన్ వద్ద నిలబడి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పొలార్డ్ పైచర్యలు తీసుకుంది.