టార్గెట్‌ను చంపేశాం.. ISIS స్థావరాలపై అమెరికా డ్రోన్ అటాక్

టార్గెట్‌ను చంపేశాం.. ISIS స్థావరాలపై  అమెరికా డ్రోన్ అటాక్

48 గంటల్లోనే అమెరికా పంతం నెగ్గించుకుంది. కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జంట పేలుళ్లు జరిపిన ISIS ఖొరాసన్ ఉగ్ర సంస్థ టార్గెట్ గా అమెరికా దాడులు చేసింది. నంగర్ హర్ ప్రావిన్స్ లో ISIS-K స్థావరాలపై డ్రోన్లతో దాడులు జరిపింది. టార్గెట్ ను చంపేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. అయితే టార్గెట్ ను మాత్రమే చంపేశామని... తమ దాడుల్లో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని తెలిపింది. కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట ISIS-K చేసిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు చనిపోయారు. అయితే ఈ దాడికి కారకులను వదిలిపెట్టబోమని... వెంటాడి వేటాడి చంపుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్ననే ప్రకటించగా... ఈ తెల్లవారుజామున డ్రోన్స్ తో దాడులు చేసినట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రకటించింది. 

కాబూల్ లో ఉన్న తమ పౌరులకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది అమెరికా. కాబూల్ ఎయిర్ పోర్ట్ అబ్బే గేట్, ఈస్ట్ గేట్, నార్త్ గేట్ ల దగ్గర ఉన్న... అమెరికన్లు అక్కడ్నుంచి వెళ్లిపోవాలని సూచించింది. గేట్ల దగ్గర్నుంచి ఇమ్మీడియట్ గా ఖాళీ చేయాలని కాబూల్ లోని అమెరికన్ ఎంబసీ స్టేట్ మెంట్ ఇచ్చింది. సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయని... మరిన్ని పేలుళ్లకు ISIS తెగబడే ప్రమాదం ఉన్నందున... అడ్వైజరీ ఇచ్చినట్టు తెలిపింది. ఇక నిన్న ఒక్కరోజే కాబూల్ నుంచి 4వేల 200 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది అమెరికా. ఆగస్ట్ 14 నుంచి మొత్తంగా లక్షా 9వేల 200 మందిని అఫ్గనిస్తాన్ నుంచి తరలించింది. 

మరోవైపు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు తొందరపడబోమని వైట్ హౌస్ స్టేట్ మెంట్ ఇచ్చింది. అమెరికా కానీ... తమ మిత్ర దేశాలు కానీ... ఇప్పుడప్పుడే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించబోవని స్పష్టం చేసింది. అఫ్గనిస్తాన్ నుంచి మొత్తంగా బలగాలను వెనక్కి తీసుకున్న తర్వాత... అక్కడ డిప్లమాటిక్ ప్రజెన్స్ ఉండాలా వద్దా అనేదానిపైనా నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది.