నార్త్‌ కొరియాలో ఆహార కొరత.. పెట్ డాగ్స్‌ను వదిలేయాలన్న కిమ్ జాంగ్?

నార్త్‌ కొరియాలో ఆహార కొరత.. పెట్ డాగ్స్‌ను వదిలేయాలన్న కిమ్ జాంగ్?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నార్త్ కొరియాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడిందని సమాచారం. ఆ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, కొందరు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీని నుంచి బయట పడేందుకు ప్రజలు తమ పెంపుడు కుక్కలను వదిలేయాలని ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్న ఆర్డర్ వేశారని సమాచారం.. తద్వారా రెస్టారెంట్‌లు కుక్కలను మాంసంగా మారుస్తాయని, ఆహార కొరత కొంత తీరుతుందని కిమ్ చెప్పారని తెలిసింది. తన నిర్ణయాన్ని సమర్థించుకోవడంలో భాగంగా కిమ్ వర్గ తేడాలను తీసుకొచ్చారు. సాధారణ ప్రజలు పశువులను ఎక్కువగా పెంచుతారని, కేవలం ధనికుల వద్ద మాత్రమే పెట్ డాగ్స్ ఉంటాయని ఆయన సమర్థించుకుంటున్నారు.

పెట్ డాగ్స్‌ క్యాపిటలిజానికి సూచిక!!
పెంపుడు కుక్కలను కలిగి ఉండటమనేది క్యాపిటలిజానికి, బూర్జువా భావజాలానికి నిదర్శనమని కిమ్ ఆలోచనగా ది మిర్రర్ అనే బ్రిటిష్ టాబ్లాయిడ్‌ తెలిపింది. నార్త్‌ కొరియాలో కుక్కలపై క్యాపిటలిస్టిక్‌ భావాల ముద్రను వేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. 1980ల నుంచి ఉత్తర కొరియాలో పెట్ డాగ్స్‌పై బ్యాన్ వేస్తూ, తొలగిస్తూ ఉన్నారని ఆ పత్రిక పేర్కొంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 2018లో నార్త్ కొరియాలో పెద్ద ఉత్సవమైన పార్టీ ఫౌండేషన్ డే సందర్బంగా ప్రజలను తమ పెంపుడు కుక్కలను ఇచ్చేయాల్సిందిగా ఆదేశించారు. పెట్ డాగ్స్‌ను ఇవ్వకపోతే బదులుగా 148 యూఎస్ డాలర్లు చెల్లించాలని ఆర్డర్ వేశారు.