సిరివెన్నెల మృతికి గల కారణాలు తెలిపిన కిమ్స్ ఎండీ

సిరివెన్నెల మృతికి గల కారణాలు తెలిపిన కిమ్స్ ఎండీ

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీలోకమంతా చిన్నబోయింది. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే ఆయన మృతికి గల కారణాలను కిమ్స్‌ ఎండీ భాస్కర్‌రావు వెల్లడించారు. 

‘క్యాన్సర్‌ వల్ల ఆరేళ్ల క్రితం సిరివెన్నెల సగం లంగ్‌ తీయాల్సి వచ్చింది. ఆయనకు గతంలో బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. వారం క్రితం మరో లంగ్‌కు క్యాన్సర్‌ వచ్చింది. దాంతో ఆయన ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తే చికిత్స కోసం కిమ్స్‌లో చేర్పించారు. ఐదు రోజులుగా సిరివెన్నెల ఎక్మో యంత్రంపైనే ఉన్నారు. ఆయన కిడ్నీ దెబ్బతినడం వల్ల శరీరమంతా ఇన్ఫెక్షన్‌  వ్యాపించింది. దాంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు’ అని కిమ్స్‌ ఎండీ భాస్కర్‌రావు తెలిపారు.