
–న్యూఢిల్లీ: ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లను తయారు చేసిన ఆటోమొబైల్ కంపెనీ కైనెటిక్ తాజా ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో ముందుకు వచ్చింది. మనదేశ మార్కెట్లోకి కైనటిక్ డీఎక్స్ఈవీని లాంచ్చేసింది.
దీని ధరలు రూ. 1.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 1.17 లక్షల వరకు ఉంటాయి. ఒక్కసారి చార్జ్‌చేస్తే 116 కి.మీ వరకు ప్రయాణిస్తాయి. మ్యాగ్జిమమ్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఇందులో 8.8 అంగుళాల డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ల డెలివరీలు సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.