ఏపీకి మళ్లీ  కింగ్​ ఫిషర్​ బీర్ వచ్చేసింది... నెటిజన్లు సెటైర్లు

ఏపీకి మళ్లీ  కింగ్​ ఫిషర్​ బీర్ వచ్చేసింది... నెటిజన్లు సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో జూన్​ 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుందాని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు మందుబాబులు. టీడీపీ సర్కార్ రావడంతో దేశంలోని పాపులర్ బ్రాండ్స్ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాన్ బ్రాండెడ్ లిక్కర్ శకానికి తెరపడింది. ఐదేళ్లుపాటు బూమ్ బూమ్ అంటూ రకరకాల నాన్ బ్రాండెడ్ లిక్కర్ ఏపీ అంతటా అమ్మకాలు సాగాయి. ప్రభుత్వం మారింది.. నాన్ బ్రాండెడ్ లిక్కర్‌ను తొలగించి బ్రాండెడ్ లిక్కర్‌ను తీసుకురావాలనే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పేరు పొందిన కింగ్ ఫిషర్ బీర్లను కంటెయినర్లలో తీసుకొచ్చి గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు.

ఏపీలో మందుబాబులకు జూన్​ 12న ఏర్పడే  కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.   రాష్ట్రంలో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది. ఇదే సమయంలో.. తిరిగి ఏపీలో బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా దేశంలో పాపులర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న కింగ్ ఫిషర్ బీర్  బాక్స్​ లను  గోడౌన్ లలో నిల్వ చేశారు.  దీనికి సంబంధించి వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు.  

అవును... ఏపీలో ఇకపై బ్రాండెడ్ మద్యం దొరకబోతుందని చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయని. ఈ మేరకు కింగ్ ఫిషర్ బీర్లతో వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి పోస్ట్ చేశారు. "ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ కింగ్ ది ఫిషర్ చీర్స్" (ఏపీకి మళ్లీ తిరిగి వచ్చేసింది.. కింగ్ ది ఫిషర్ చీర్స్) అని ట్వీట్ చేశారు. దీంతో.. ఈ ట్వీట్ కింద కామెంట్లు హోరెత్తిపోతున్నాయి. నెటిజన్లు క్రియేటివిటీకి పని చెబుతూ... ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. 

 వైసీపీ అధికారంలోకి రాగానే బ్రాండెడ్ మద్యం అమ్మకాలను నిలిపివేసింది. గుర్తింపు లేని రకరకాల మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించింది. ఇది పెద్ద స్కాం అంటూ తొలి నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై చర్చ జరుగుతోంది. అధికారంలోకి రాగానే మద్యం పాలసీని రద్దు చేసింది. దాన్ని రద్దు చేయాలని టీడీపీ సర్కార్ ఆలోచన చేస్తోంది. డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3500 మద్యం షాపులకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని ప్లాన్ చేస్తోంది. డిపాజిట్ సొమ్ము తిరిగి ఇవ్వకుండా రూరల్, అర్బన్ ఏరియాలుగా విభజన చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 45 వేలు, అర్బన్ ఏరియాలో 55 వేలు డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు చేస్తోందని సమాచారం అందుతోంది.