బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తుండగా, షారుక్ కూతురు సుహానా ఖాన్ కీలకపాత్ర పోషిస్తోంది. దీపికా పదుకొనె, జాకీ ష్రాఫ్, రాణీ ముఖర్జీ, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో కరీనా కపూర్ కూడా ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవబోతోంది. ఇందులో ఆమె అతిథి పాత్రలో మెరవడంతో పాటు ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోందట. కభీ ఖుషీ కభీ గమ్, అశోక, రా.వన్ చిత్రాల్లో కలిసి కనిపించిన ఈ జంట 15 ఏళ్ల తర్వాత తిరిగి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.
ఇక షారుక్ సినిమాల్లో స్పెషల్ అప్పీయరెన్స్ కరీనాకు కొత్తేమి కాదు. గతంలో డాన్, బిల్లు చిత్రాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు ‘కింగ్’లో ‘డాడీ కూల్’ అంటూ సాగే పెప్పీ డాన్స్ నెంబర్‌లో మరోసారి షారుక్‌తో కలిసి స్టెప్పులేయబోతోంది. ఈ నెలాఖరులో సౌత్ ఆఫ్రికాలో ఈ పాటను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్, పఠాన్ సినిమాల తర్వాత షారుక్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘కింగ్’పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
