దంచికొట్టిన హైదరాబాద్..పంజాబ్ కు బిగ్ టార్గెట్

దంచికొట్టిన హైదరాబాద్..పంజాబ్ కు బిగ్ టార్గెట్

దుబాయ్: ఐపీఎల్ 13 సీజన్ లో భాగంగా గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రైజర్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. హైదరాబాద్ కు మంచి ప్రారంభం దక్కడంతో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(52), జానీ బెయిర్ స్టో(97 ), చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. సిక్సర్లు, బౌండరీలతో మోత మోగించడంతో హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వరుస ఓటముల తర్వాత ఈ మ్యాచ్ తో కసి తీరా కొట్టారు హైదరాబాద్ ప్లేయర్లు.

ఓపెనర్లను ఔట్ చేయడానికి పంజాబ్ బౌలర్లు ఎంత కష్టపడ్డా ఫలితంలేకపోయింది. పంజాబ్ లోని ఆరుగురి బౌలర్లను ఉతికారేశారు వార్నర్, బెయిర్ స్టో. అయితే రవి బిష్నోయ్ వేసిన 15వ ఓవర్ లో హైదరాబద్ స్కోర్ 160 దగ్గర ఓపెనర్లు ఔటయ్యారు. ఈ తర్వాత వచ్చిన మనీష్ పాండే(1), అబ్దుల్ సమద్(8), ప్రియమ్ గార్గ్(0) కూడా వెంటనే ఔట్ అయ్యారు. దీంతో 3 ఓవర్లు వేస్ట్ అయినప్పటికీ .. చివర్లో కేన్ విలియమ్సన్(20 నాటౌట్), అభిషేక్ శర్మ(12) వరుసగా బౌండరీలు బాదడంతో సన్ రైజర్స్ 200 మార్క్ ఈజీగా దాటింది. ఇక బౌలింగ్ లోనూ రైజింగ్ అయితే.. ఈ మ్యాచ్ హైదరాబాద్ దే అనడంలో సందేహం లేదంటున్నారు స్పోర్ట్స్ ఎనలిస్టులు.

హైదరాబాద్ బౌలర్లలో.. రవి బిష్నోయ్ కి (3) వికెట్లు దక్కగా.. అర్ష్ దీప్ సింగ్ (2), మహ్మద్ షమీ (1) వికెట్లు తీశారు.