
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన మూవీ ‘కె ర్యాంప్’(K-Ramp). నిన్న (అక్టోబర్ 18న) ఈ మూవీ రిలీజైంది. దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద 'డ్యూడ్', 'తెలుసు కదా', మిత్ర మండలి మూవీస్తో కె ర్యాంప్ పోటీ పడుతోంది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం సినిమాకు ఫస్ట్ డే ఓపెనింగ్ బాక్సాఫీస్పై లుక్కేస్తున్నారు ఆడియన్స్.
సాక్నిల్క్ వెబ్‌సైట్ ముందస్తు అంచనాల ప్రకారం,
'కె-రాంప్' తొలి రోజున (అక్టోబర్ 18న) రూ.2.15 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. ఇది మంచి ఓపెనింగ్ అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శనివారం తెలుగు రాష్ట్రాల్లో 'కె-ర్యాంప్' మొత్తం 37.10% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఉదయం షోలలో 26.01%, మధ్యాహ్నం 35.14%, సాయంత్రం 35.98% మరియు రాత్రి షోలలో 51.27% ఆక్యుపెన్సీ సొంతం చేసుకుంది. అయితే, 'కె-రాంప్' ప్రపంచవ్యాప్తంగా రూ.5 నుంచి 6 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి.
Kumar Abbavaram gadi Rampu modhalu 🔥🔥🔥#KRamp North America gross smashes $100K+ mark and counting… 🧨🧨🧨
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 19, 2025
Overseas by @PrathyangiraUS@Kiran_Abbavaram @realyukti @RajeshDanda_ @HasyaMovies pic.twitter.com/avICj2PrcE
గతేడాది దీపావళి సందర్భంగా రిలీజైన 'క' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి కిరణ్ కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించింది. అయితే, ఈ క్రమంలో ‘కె ర్యాంప్' ఫస్ట్ డే గ్రాస్ ఎంతనేది మేకర్స్ ఇవాళ ఆదివారం ప్రకటించే అవకాశముంది.
మూడు సినిమాల ఓపెనింగ్స్:
డ్యూడ్ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో అదరగొట్టింది. శుక్రవారం (అక్టోబర్ 17న) విడుదలైన డ్యూడ్ సినిమాకు.. ఫస్ట్ డే ఇండియాలో సుమారు రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. తెలుగులో రూ.3 కోట్లు వసూళ్లు చేసింది. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రూ.2 కోట్లకి పైగా చేసింది. అయితే, వీటికి తగ్గట్టుగానే కే ర్యాంప్ రూ.2.15 కోట్లకు పైగా నెట్ సాధించి.. సమానమైన పోటీగా నిలిచింది.
కే ర్యాంప్ బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ ఎంత?
కే ర్యాంప్ మూవీ దాదాపు రూ.4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. తెలుగు రాష్ట్రాలలో రూ.6.25 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.2 కోట్లు
సీడెడ్ థియేట్రికల్ రైట్స్ రూ.1.25 కోట్లు,
ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.3 కోట్లు
తెలుగు రాష్ట్రాలలో మొత్తం= రూ.6.25 కోట్లు
తెలుగేతర రాష్ట్రాలు విషయానికి వస్తే... కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.30 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 8.15 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు టాక్. ఈ లెక్కన కే ర్యాంప్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సీఫీస్ వద్ద రూ.9 కోట్ల షేర్, రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ నిపుణుల అంచనాలు చెబుతున్నాయి.