KA Teaser Review: 'క' టీజర్ వచ్చేసింది..మిస్టరీ థ్రిల్లర్గా ట్విస్టులు..కిరణ్కి హిట్ పక్కా!

KA Teaser Review: 'క' టీజర్ వచ్చేసింది..మిస్టరీ థ్రిల్లర్గా ట్విస్టులు..కిరణ్కి హిట్ పక్కా!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA)టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.నేడు (జూలై 15) హీరో కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఎవరు నువ్వు..ఎక్కడ్నించి వచ్చావ్..అంటూ టీజర్ మొదలవ్వగా టైమ్ ట్రావెల్ లాంటి వస్తువును చూపించి కృష్ణగిరి అనే మారుమూల అటవీ ప్రాంతం నుండి వచ్చినట్టు హీరోని చూపించారు.ఈ పల్లెటూర్లో పోస్ట్ మ్యాన్ గా పని చేస్తూ ఆ ఊరి ప్రజలకు వచ్చే ఉత్తరాలను చదువుతు తిరిగే కుర్రాడిగా చూపిస్తూనే..ఆ తర్వాత అతనిలోని ఇంటెన్స్ ను పరిచయం చేశారు.

పక్కవాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏంటీ నీకు..నీకంటూ ఎవరు లేరా?అని ప్రశ్నిస్తూ..పోస్ట్ మ్యాన్ గా పనిచేసే నువ్వు హత్యలు చేసేవరకు వెళ్లినట్టుగా'టీజర్ లో చూపించారు.ఇక చివర్లో మీకు తెలిసి నేను మంచి.కానీ నేను..అంటూ గోడపై sr.ఎన్టీఆర్ రావణాసురుడి ఫోటోని చూపిస్తూ తోడేలువురా నువ్వు అంటూ విలన్ చెప్పేటు వంటి షాట్స్ ఆకట్టుకున్నాయి.చివరలో ఆంజనేయస్వామి,ఎద్దులబండి,ఉత్తరాలు,అమ్మవారి జాతర వీటన్నిటికి లింక్ ఏంటనే సస్పెన్స్ తో సైకిల్ హ్యాండిల్ తో ఫైట్ చేసిన హీరోపై టీజర్ ను ముగించారు.ఒక్కమాటలో చెప్పాలంటే టీజర్ ఆద్యంతం ట్విస్ట్ లతో ఆసక్తికరంగా ఉంది. 

Also Read:మై డార్లింగ్ ఫ్యాన్స్..‘మీరు లేనిదే నేను లేను'..ప్రభాస్ ఎమోషనల్ వీడియో

శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్,కిరణ్ అబ్బవరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్,సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట.ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తవగా..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. 

2018 ఫేమ్ తన్వి రామ్ హీరోయిన్.ఇకపోతే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీతో కిరణ్ ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.