కౌలు రైతు సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ సమావేశం

కౌలు రైతు సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ సమావేశం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సలహాలు, సూచనలపై గాంధీభవన్ లో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర సమావేశం జరిగింది.  మంగళవారం జరిగిన ఈ మీటింగ్ కు అన్వేష్ రెడ్డి అధ్యక్షత వహించగా, జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.

కౌలు రైతులకు సంబంధించిన సమస్యలపై త్వరలో ఒక నివేదికను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రైతు భరోసాను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై కూడా చర్చించారు.