బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది : కొండపల్లి శ్రీధర్​రెడ్డి

బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది : కొండపల్లి శ్రీధర్​రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి, వెలుగు : బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు  కొండపల్లి శ్రీధర్​రెడ్డి అన్నారు. లక్ష్మీదేవిపల్లిలో,  ములకలపల్లిలో ఆదివారం వేర్వేరుగా నిర్వహించిన అసెంబ్లీ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్​ స్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీఆర్​ఎస్​ను ఓడించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. లక్ష్మీదేవిపల్లిలో జిల్లా కో ఆర్డినేటర్​నాళ్ల సోమసుందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీ. రంగాకిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇన్​చార్జి రంగరాజు రుక్మరావు, ములకపల్లిలో కన్వీనర్ గొట్టిపాళ్ల దుర్గా శ్రీను, జిల్లా ఇన్​చార్జి ఉప్మా రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోమ సుందర్ రావు, రాంబాబు, రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యులు జూదూరి చెన్నారావు, దమ్మపేట యువజన అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.