బీసీల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పే దమ్ముందా: కిషన్రెడ్డి

బీసీల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పే దమ్ముందా: కిషన్రెడ్డి

బీసీలపై ఇంతగా ప్రేమ ఒలకబోస్తున్న సోకాల్డ్ కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీల కోసం ఏం చేశారో చెప్పే దమ్ముందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. స్వతంత్ర భారతంలో మొదటిసారి బీసీ నాయకుడిని ప్రధాన మంత్రిని చేసింది బీజేపీ అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్దత కల్పించింది బీజేపీ అన్నారు. మోదీ ప్రభుత్వంలో 27 మంది బీసీలను మంత్రులుగా ఉన్నారని తెలిపారు. 

తెలంగాణకు చెందిన నాయకుడిని ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా చేసిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతను పార్టీలో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది బీజేపీ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన 39 సీట్లలో 20 మంది(52శాతం) బిసీ నాయకులను అభ్యర్థులుగా ప్రకటించిన పార్టీ బీజేపీ అన్నారు. బీసీ సాధికారతకు కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తు్న్నామన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.