కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరేస్తున్నాం..లోక్‌సభలో కిషన్‌రెడ్డి

కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరేస్తున్నాం..లోక్‌సభలో కిషన్‌రెడ్డి

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం దేశ భద్రత, సరిహద్దుల రక్షణ  విషయంలో రాజీలేని పోరాటం చేస్తోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. జమ్ముకశ్మీర్ రాష్ట్ర భద్రత వ్యవహారాల బాధ్యతలు కూడా చూస్తున్న కిషన్ రెడ్డి… ఉగ్రవాదుల ఏరివేత ఎలా సాగుతుందో లోక్ సభలో వివరించారు.

పక్కా ప్రణాళిక, సమన్వయం, ముందు చూపుతో జమ్ముకశ్మీర్ లో భద్రతాబలగాలు వ్యవహరిస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి. జమ్ము కశ్మీర్ లో 2018తో పోల్చితే… ఇపుడు పౌరులకు భద్రత ప్రమాణాలు పెరిగాయన్నారు.

ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలు 28 శాతం తగ్గాయన్నారు కిషన్ రెడ్డి. చొరబాట్లు 43 శాతం తగ్గాయన్నారు. స్థానికంగా ఉగ్రవాదుల చేరికలు 40శాతం తగ్గాయన్నారు. ఉగ్రవాదుల ఏరివేత 22శాతం పెరిగాయన్నారు కిషన్ రెడ్డి.