
సికింద్రాబాద్ లోక్ సభ సభ్యుడు కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఢిల్లీలో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ ముందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి చేత ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన బండారు దత్తాత్రేయ.. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి మోడీ తన టీమ్ లో చోటు కల్పించారు.
ఢిల్లీకి రావాలంటూ ఈ ఉదయం కిషన్ రెడ్డికి అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. ప్రమాణ స్వీకారానికి హాజరైన కిషన్ రెడ్డి ఆహార్యం ఆకట్టుకుంది. తలపాగా చుట్టి.. కాషాయ రంగు కుర్తా ధరించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.