రామాయణం స్ఫూర్తితో ‘కిష్కింధపురి’.. ఈ సినిమాని డీ కోడ్ చేస్తే..

రామాయణం స్ఫూర్తితో ‘కిష్కింధపురి’.. ఈ సినిమాని డీ కోడ్ చేస్తే..

‘చావు కబురు చల్లగా’ తర్వాత దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందించిన చిత్రం ‘కిష్కింధపురి’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ ‘నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే హారర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డిఫరెంట్ ఫిల్మ్ చేయాలనిపించి ఈ కథ రాశా. ఇందులో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు కొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చూపించబోతున్నాం. -ఈ కథకి స్ఫూర్తి రామాయణం. ఈ సినిమాని డీ కోడ్ చేసుకున్న వారికి రామాయణం నుంచి చాలా రిఫరెన్సెస్‌‌‌‌‌‌‌‌ దొరుకుతాయి.

1989లో జరిగే కథ కావడంతో అలాంటి వింటేజ్ వైబ్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్ చేశాం. సెట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు  లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి.  రేడియో స్టేషన్ కోసం మ్యాసివ్ సెట్ వేశాం. సాయి శ్రీనివాస్ యాక్షన్ మార్క్ ఉన్న హీరో. ఇందులో మాత్రం తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. అనుపమ  ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ చేశారు. సాహు గారపాటి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కొన్ని సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లు చాలా భయపెట్టేలా ఉండటంతో సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది కానీ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ సినిమా ఇది” అని చెప్పాడు.