
బాలీవుడ్‌లో ఈద్ సీజన్ అనగానే సల్మాన్ ఖాన్ సినిమాలు గుర్తొస్తాయి. ఈ ఏడాది కూడా ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే వచ్చే ఏడాది ఈద్ పండగకు తన సినిమా రాబోతున్నట్టు ఏడాది ముందే అక్షయ్ కుమార్ అనౌన్స్ చేశాడు. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ దీనికి దర్శకుడు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు.
కానీ షూటింగ్ ఆలస్యమవడంతో ఆ టైమ్‌కు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవచ్చని రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేశారు. శుక్రవారం అక్షయ్ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటోస్‌లో గన్స్ పట్టుకుని ఆర్మీ గెటప్‌లో కనిపిస్తున్నారు అక్షయ్, టైగర్. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆజ్ ఫిలింస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.