డునెడిన్ (న్యూజిలాండ్): పేసర్ జాకబ్ డఫీ (4/35) నాలుగు వికెట్లతో విజృంభించడంతో వెస్టిండీస్‌తో గురువారం జరిగిన చివరి, ఐదో టీ20లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దాంతో సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. డఫీ దెబ్బకు తొలుత విండీస్ 18.4 ఓవర్లలో 140 రన్స్‌కే కుప్పకూలింది. రోస్టన్ ఛేజ్ (38), రొమారియో షెఫర్డ్ (36) మాత్రమే రాణించారు. అనంతరం ఓపెనర్లు కాన్వే (47 నాటౌట్) రాబిన్సన్ (45) మెరుపులతో కివీస్ 15.4 ఓవర్లలోనే 141/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.
