హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా శనివారం సెక్రటేరియెట్లో కె.కేశవరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆయనకు అభినందనలు తెలిపారు. పలువురు కాంగ్రెస్ నేతలు కేకేను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
