జింబాబ్వే వన్డే సిరీస్.. భారత జట్టు

జింబాబ్వే వన్డే సిరీస్.. భారత జట్టు

జింబాబ్వేతో వన్డే సిరీస్ కు టీమిండియా సిద్ధమౌతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ కు జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. టీమిండియా కెప్టెన్ గా రాహుల్ ను ఎంపిక చేస్తూ.. ప్రకటించింది. గురువారం రాత్రి ప్రకటన చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. జట్టుకు వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు.

రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ లను ఎంపిక చేసింది. జింబాబ్వే పర్యటనలో టీమిండియా అతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ మూడు వన్డేలు హరారేలో జరుగనున్నాయి. ఆగస్టు 18వ తేదీ మొదటి వన్డే జరుగనుంది. అనంతరం ఆగస్టు 20వ తేదీ శనివారం రెండో వన్డే, ఆగస్టు 22వ తేదీ సోమవారం మూడో వన్డే జరుగనుంది.