IND v ENG: లండన్‌కు వెళ్లిపోయిన రాహుల్.. ఐదో టెస్టుకు దూరం

IND v ENG: లండన్‌కు వెళ్లిపోయిన రాహుల్.. ఐదో టెస్టుకు దూరం

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్  కేఎల్‌ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ ఆడిన రాహుల్.. ఆ తర్వాత తొడకండరాలు పట్టేడయడంతో రెండు, మూడు, నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. గత రెండు వారాలుగా అతను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందాడు. నాలుగో టెస్ట్ సమయానికి కోలుకున్నట్లుగా కనిపించినా.. గాయం తిరగ బెట్టడంతో అతన్ని బీసీసీఐ లండన్ పంపించినట్టు నివేదికలు చెబుతున్నాయి.      

లండన్ లో రాహుల్ వైద్య నిపుణుల వద్ద చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. అతని గాయంపై గాయంపై మార్చి 2 నాటికి ఒక క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తుంది. నిజానికి అతడు మూడో టెస్టులో ఆడతాడనుకున్న చివరి నిమిషంలో వైదొలిగాడు. దీంతో అతని స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను ఎంపికచేశారు. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో మాత్రమే ఆడిన రాహుల్.. 86 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవేళ కోలుకోవడానికి ఎక్కువ సమయం పడితే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లను దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. చివరి మూడు సీజన్ ల నుంచి ఐపీఎల్ లో అత్యంత నిలకడ చూపిస్తున్నాడు. ఈ సారి ఓపెనర్ గా మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. చివరి ఐపీఎల్ సీజన్ లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమయ్యాడు. ఆ తర్వాతా ఆసియా కప్ లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.