
హైదరాబాద్, వెలుగు: కేఎల్ఎం రాయల్ డచ్ఎయిర్లైన్స్ హైదరాబాద్, ఆమ్స్టర్డామ్ల మధ్య తన కొత్త విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇది వారానికి మూడుసార్లు నడుస్తుంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మొదటి విమానం కేఎల్ 874 బుధవారం ఆమ్స్టర్డామ్కు బయలుదేరింది.
గతంలో బెంగళూరు, ఢిల్లీ, ముంబైల నుంచి మాత్రమే కేఎల్ఎం సేవలు ఉండేవి. హైదరాబాద్ నుంచి ఈ విమానం ఉదయం 2.20 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 8.40 గంటలకు ఆమ్‌స్టర్‌డామ్ చేరుకుంటుంది. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కేఎల్873 విమానం ఉదయం 11.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 00.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.