
Insurance Secrets: ప్రస్తుతం చాలా మంది మధ్యతరగతి ప్రజలు సైతం జీవన ప్రమాణాలు, ఆదాయం పెరుగుదలతో కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది కారుకు ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు. అయితే ఆ తర్వాత చేసే కొన్ని తప్పులు వారికి ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇవి వారి ఇన్సూరెన్స్ క్లెయిన్స్ రిజెక్ట్ కావటం, ఎక్కువ ప్రీమియం చెల్లింపులకు దారితీస్తున్నాయి. అయితే వీటి గురించి సహజంగా చాలా మందికి అస్సలు తెలియదు. అందుకే ఐదు కార్ ఇన్సూరెన్స్ సీక్రెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి...
* ఒకవేళ మీ కారు ఇన్సూరెన్స్ ఎక్స్‌పెయిరీ అయితే సకాలంలో దానిని రెన్యువల్ చేసుకోకపోతే.. మీరు కూడబెట్టుకున్న నో క్లెయిమ్ బోనస్ వల్ల రావాల్సిన డిస్కౌంట్ మెుత్తం కోల్పోతారు. లేటుగా పాలసీ రెన్సూవల్ చేస్తే తిరిగి మెుదటి నుంచి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
* ఒకవేళ మీరు కారు కొన్నాక షోరూంలో గానీ లేదా బయట గానీ దానికి ఎలాంటి మార్పులు చేసినట్లయితే.. దాని వల్ల మీరు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది. ఒకవేళ పాలసీ తీసుకునే సమయంలో ఈ మార్పుల గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేకపోతే తర్వాత క్లెయిమ్ కోసం ప్రయత్నించినప్పుడు దానిని వారు పూర్తిగా నిరాకరించే ప్రమాదం ఉంటుంది.
* ఒకవేళ మీరు అధిక ప్రీమియం కారణంగా పాలసీని కొనుగోలు చేయటం కష్టంగా మారితే.. మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి క్లెయిమ్లో కొంత భాగాన్ని వదులుకునేందుకు ఇష్టపడితే వారు ప్రీమియం తగ్గిస్తారు.
* ఒకవేళ మీ కారుపై ఏదైనా గీతలు, స్కాచెస్ పడితే దానికి సొంతంగా డబ్బు ఖర్చు చేసుకోవటం ఉత్తమం. ఒకవేళ దీనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వెళితే కారు యజమాని నో క్లెయిమ్ బోనస్ కోల్పోవటంతో పాటు ఇది పాలసీ ప్రీమియం 50 శాతం వరకు పెంచుతుంది.
* ఇక చివరిగా చాలా మందికి అస్సలు తెలియని అతిపెద్ద కారు ఇన్సూరెన్స్ సీక్రెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నగరాల్లో క్యాబ్ సర్వీసెస్ అందుబాటులోకి రావటంతో చాలా మంది తమ సొంత కార్లను వినియోగించటం తగ్గించారు. ఇలాంటి వారు ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద నడిపిన కిలోమీటర్లకు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకునే సౌకర్యాన్ని ఉపయోగించుకోవటం ఉత్తమం. దీనినే పేయాజ్ యూ డ్రైవ్ ఫ్యూచర్ అని పిలుస్తారు. ఒకవేళ ముందుగా చెప్పిన కిలోమీటర్ల కంటే తక్కువ కారును నడిపితే తర్వాత సంవత్సరం ప్రీమియం చెల్లింపులో డిస్కౌంట్ కూడా పొందవచ్చు.