బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నివసించటానికి బెస్ట్ ఏరియాలు ఇవే.. పూర్తి వివరాలు

బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నివసించటానికి బెస్ట్ ఏరియాలు ఇవే.. పూర్తి వివరాలు

ఐటీ ఉద్యోగం అనగానే దేశంలో ముందుగా గుర్తొచ్చేది బెంగళూరు నగరం. అక్కడ టెక్ పరిశ్రమ నుంచి స్టార్టప్ ఎకోసిస్టమ్ వరకు ఉండటం చాలా మందిని నగరానికి వెళ్లేలా చేస్తోంది. అయితే ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా అద్దె, ప్రాపర్టీ రేట్లు ఏ ఏరియాలో ఉన్నాయనే విషయాలు చాలా మందికి అవగాహన లేదు. ఈ క్రమంలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

ముందుగా టెక్కీలకు అనువైన నివాస ప్రాంతాల్లో వైట్ ఫీల్డ్ ఏరియా ఉంది. ఇక్కడ ఇంటి అద్దెలు రూ.18వేల నుంచి రూ.65వేల వరకు ఉన్నాయి. ఇక్కడ ప్రాపర్టీ రేట్లు చదరపు అడుగుకు రూ.6వేల 500 నుంచి రూ.11వేల 400 మధ్య ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ బాగుంటుంది. అత్యంత రద్దీ సమయాల్లో కూడా ఇక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బంది తప్పదు.

ఇక ఐటీ ఉద్యోగులకు రెండవ ఎంపికగా ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతం ఉంది. ఇక్కడ ఇంటి అద్దెలు కనీసం రూ.5వేల నుంచి స్టార్ట్ అయ్యి రూ.50వేల వరకు ఉన్నాయి. ఈ ప్రాంతంలో టాప్ టెక్ కంపెనీలు తమ ఆఫీసులను కలిగి ఉన్నాయి. ఇక్కడ ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు 3వేల900 నుంచి రూ.6వేల 500 మధ్య కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా యువకులు, కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసే వ్యక్తులు ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రాంతంలో కొంత నీటి సమస్యలు కూడా ఉన్నాయి.

ALSO READ : ట్రాఫిక్ అంటే ఇదీ : ఫ్రెండ్‌ను విమానం ఎక్కించాడు.. వాళ్లు దుబాయ్‌లో దిగారు.. అతను ఇంటికి చేరలేదు..!

టెక్కీల బెస్ట్ ఎంపికల్లో నివాసానికి హెచ్ఎస్ఆర్ లేఔట్ ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ ఇంటి అద్దెలు రూ.15వేల నుంచి రూ.50వేల మధ్య ఉన్నాయి. ఈ ప్రాంతం నేరుగా కోరమంగలా, సర్జాపూర్, ఎలక్ట్రానికి సటీ ప్రాంతాలకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే ఇక చదరపు అడుగుకు ప్రాపర్టీ రేట్లు రూ.7వేల నుంచి రూ.14వేల మధ్య కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో స్కూళ్లు, హాస్పిటల్ వంటి మంచి వసతులు ఉన్నాయి. 

ఇక కోరమంగళా ప్రాంతంలో అద్దెలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక్కడ స్టార్టింగ్ రెంట్ రూ.25వేలు ఉండగా అత్యధికంగా రూ.85వేల వరకు ఉన్నాయి. ఇక ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు రూ.15వేలుగా ఉన్నాయి. ఇదే క్రమంలో సర్జాపూర్ ప్రాంతంలో అద్దెలు రూ.18వేల నుంచి రూ.40 వేల మధ్య ఉండగా.. బెల్లందూరులో అద్దెలు రూ.25వేల నుంచి రూ.45వేల మధ్య కొనసాగుతున్నాయి. 

ఇక మాన్యత టెక్ పార్క్, కెంపగౌడ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న హెబ్బల్ ప్రాంతంలో అద్దెలు రూ.9వేల 500 నుంచి స్టార్ట్ అవుతూ గరిష్ఠంగా రూ.40వేల వరకు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చేరువలో ఐబీఎమ్, కాగ్నిజెంట్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ప్రశాతంగా ఉండే ప్రాంతంలో స్కూళ్లు, ఆసుపత్రుల సౌకర్యం బాగుంటుంది. ఇక చివరిగా ఇందిరా నగర్ ప్రాంతంలో అద్దెలు అత్యధికంగా రూ.50వేల నుంచి స్టార్ట్ అవుతూ రూ.80వేల వరకు నెలకు ఉన్నాయి. ఇక ప్రాపర్టీ కొనాలనుకునే వారికి చదరపు అడుగు ధర రూ.17వేల వరకు ఉంది. ఈ ప్రాంతం బెంగళూరులో సంపన్నులు నివసించే ఏరియా. ప్రీమియం లివింగ్ కావాలనుకునే వారికి ఈ ప్రాంతం మంచి ఎంపికని చెప్పుకోవచ్చు. 

మెుత్తానికి బెంగళూరులో చూడటానికి ఆదాయం, వేతనాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఖర్చులు కూడా దానికి తగినట్లుగానే ఉన్నాయి. వచ్చే జీవితంలో 40 శాతం ఇంటి అద్దెకు పోతుంది. ఇక కిరాణాకు 20 శాతం, రవాణాకు 15 శాతం, వినోదానికి 10 శాతం, కనీస అవసరాలకు 10 శాతం పోతుండగా కేవలం 15 శాతం వరకు మాత్రమే సేవింగ్స్ ఉంటున్నాయని తేలింది.