కోదాడ, వెలుగు: దేశభక్తిని పెంపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా, జిల్లా యంత్రాంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కోదాడ జడ్పీ హెచ్.ఎస్. మైదానంలో ఏర్పాటు చేసిన ‘సర్దార్ 150 యూనిట్ మార్చ్’ను ఆయన మంగళవారం ప్రారంభించారు.
డీఎస్పీ ముందుగా సర్దార్ పటేల్ ఫొటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ఎంఈ వో సలీం షరీఫ్, జిల్లా యువజన సర్వీసుల అధికారి, ర్యాలీ కోఆర్డినేటర్ శ్రీకాంత్, కిట్స్ కళశాల ప్రిన్సిపాల్ గాంధీ విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
