మునగాల, వెలుగు : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేనికృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ ఆఫీస్ ఆవరణలో జరిగిన ఇందిరమ్మచీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అంతకు ముందు చెరువు గట్టునున్న పార్వతి గంగాధర స్వామి శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊర చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా పొదుపు సంఘాల వారికి సబ్సిడీపై క్యాంటీన్ల నిర్వహణ, ఐకేపీ కేంద్రాల నిర్వహణ ఇలా ప్రతి పథకాన్ని మహిళలకు అందిస్తూ వారిని కోటీశ్వరులుగా తయారు చేసేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపారు.
చేతివృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వృత్తిదారులకు తమ ప్రభుత్వం అన్ని రకాల అవకాశాల్నికల్పిస్తోందన్నారు. మత్స్యకారులు కూడా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలోఆర్డీఓ సూర్యనారాయణ, మండలప్రత్యేకఅధికారి శిరీష, ఏపీడి లక్ష్మినారాయణ, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఏపీఎం కరుణాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, కాసర్ల కోటయ్య, ఉప్పుల రజిత జానకి రెడ్డి, ఎలక నరేందర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, కొమ్ము ఈదారావు తదితరులు పాల్గొన్నారు
