కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వేంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ యజమాని సత్యనారాయణకు సంబంధించిన విద్యాసంస్థలు, రైస్‌మిల్లులు, హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు మరో మూడు చోట్ల సోమవారం ఈడీ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు.
కోదాడలో రైస్‌మిల్లు నిర్వహించే సత్యనారాయణ తన వ్యాపారం కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ జాతీయ బ్యాంక్‌లో గతంలో రూ. 100 కోట్ల లోన్ తీసుకున్నాడు. ఆ నిధులను దారి మళ్లించడంతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడం లేదని గతంలోనే ఈడీకి ఫిర్యాదులు అందాయి. దీంతో కేసు నమోదు చేసిన ఈడీ ఆఫీసర్లు దర్యాప్తులో భాగంగా దాడులు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
